Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

 విభిన్న ప్రతిభావంతులకు రాయితీపై పెట్రోల్/డిజిల్

    మూడు చక్రాల మోటారుతో నడిచే వాహనాలను వినియోగించే విభిన్న ప్రతిభావంతులకు ఇంధన భారం లేకుండా ప్రభుత్వం పెట్రోల్/డిజిల్ ఖర్చులో 50% రాయితీగా రీయింబర్స్ చేయబడుతుంది. 

గమనిక: కాకినాడ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము నుండి సమాచారము సేకరించడమైనది.

అర్హులు:

  • ప్రైవేట్ ఉద్యోగులు
  • స్వయం ఉపాధి కలిగిన వారు
షరతులు:
  • లబ్దిదారులు ఇంటి నుండి పని ప్రదేశానికి, తిరిగి ఇంటికి ప్రయాణించేందుకు మాత్రమే వర్తింపజేయబడును.
  • 2 హార్స్ పవర్ ఇంజిన్ సామర్ధ్యం ఉండే వాహనానికి నెలకు గరిష్టంగా 15 లీటర్లు మరియు 2 హార్స్ పవర్ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్ధ్యం ఉండే వాహనానికి నెలకు గరిష్టంగా 25 లీటర్లు వరకు పరిమితి విధించబడింది. 
  • దారిద్ర రేఖకు దిగువ ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
దరఖాస్తుకు జత చేయవలసిన ధృవపత్రాలు:
  • సదరం సర్టిఫికేట్ 
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు 
  • బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజి 
  • డ్రైవింగ్ లైసెన్సు 
  • వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు
  • వ్యాపారం లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్నట్లు ధృవీకరణ పత్రం 
  • ఇంధనం కొనుగోలు చేసిన బిల్లులు
దరఖాస్తు నందు పూర్తి చేయవలసిన అదనపు సమాచారము:
  • అంధులు అయినచో తమ మోటారు వాహనాన్ని నడిపే డ్రైవర్ పేరు, పూర్తి చిరునామా మరియు అతని/ఆమె మోటారు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్.
  • దరఖాస్తుదారులు తమకు అవసరమైన పెట్రోల్ / డీజిల్ కొనుగోలు చేయాలనుకుంటున్న డీలర్ చిరునామా మరియు లొకేషన్.
దరఖాస్తు చేసుకొను విధము:
  • అర్హత కలిగియున్న దరఖాస్తుదారులు పైన తెలిపిన సమాచారము మేరకు ధృవపత్రములన్నియు దరఖాస్తునకు జతపరచి సంబంధిత జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయములో సమర్పించవలెను. అటు తర్వాత అర్హులైన వారికి రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి