విభిన్న ప్రతిభావంతులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ చెల్లించే రవాణా భత్యం
జి.ఒ. :
జి.ఒ. సారాంశము :
- G.O.Ms.No.1, ఫైనాన్స్ (PC-TA) విభాగం, తేదీ:17.01.2022 ప్రకారం 11వ PRC & రివైజ్డ్ పే స్కేల్స్, 2022 యొక్క సిఫార్సుల అమలుపై ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది.
- రాష్ట్ర ప్రభుత్వం ఇతర అలవెన్సుల విషయంలో 11వ PRC సిఫార్సులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ ఉత్తర్వులను జారీ చేస్తుంది.
- వైకల్యం యొక్క స్వభావంతో సంబంధం లేకుండా, విభిన్న ప్రతిభావంతులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ చెల్లించే రవాణా భత్యం, నెలకు గరిష్టంగా రూ.2000/-కి లోబడి ప్రాథమిక వేతనంలో 10%కి సవరించబడుతుంది.
- క్యాజువల్ లీవ్ మినహా ఎటువంటి లాంగ్ లీవ్ పెట్టిన ఈ భత్యం వర్తించదు.
- ఇది రవాణా(ట్రాన్స్పోర్ట్) నిమిత్తం చెల్లించే భత్యం. కావున ఈ భత్యం మెడికల్ లీవ్, మెటర్నిటీ లీవ్ మరియు ఇతర సెలవులు ఏవైనా దీర్ఘకాలంగా పెట్టి విధులకు హాజరు కానిచో వారికి ఈ భత్యం వర్తించదు.
ఉదాహరణకు విభిన్న ప్రతిభావంతులైన ఒక ప్రభుత్వ ఉద్యోగి మెడికల్ లీవ్ 15 రోజులకు ధరఖాస్తు చేసుకొనిన తరువాత మిగిలిన 15 రోజులు వారు రవాణా సౌకర్యమును ఉపయోగించుకొని, కార్యాలయమునకు వెళ్ళి విధులు నిర్వర్తించినందుకుగాను వారికి చెల్లించే ₹2000 భత్యంకి బదులుగా 15 రోజులకు ₹1000 చెల్లించబడుతుంది. - ఆన్యువల్ సరెండర్ బిల్లుకు (EL) ఈ భత్యం వర్తించదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి