సదరం సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దివ్యాంగులకు జారీ చేసే ఒక అధికారిక ధృవపత్రం. సదరం (SADAREM - Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) దివ్యాంగుల అంచనా, పునరావాసం, మరియు శక్తివంతం కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్. ఈ సర్టిఫికేట్ ద్వారా సదరం సర్టిఫికేట్ దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు, పెన్షన్, ఉచిత ఉపాధి అవకాశాలు, ప్రయాణంలో రాయితీ, ప్రత్యేక విద్యా సదుపాయాలు, మరియు ఇతర లబ్దిలను పొందగలరు.
ఆంధ్ర ప్రదేశ్ సదరం సర్టిఫికేట్ పొందడానికి, ముందుగా ఆన్లైన్లో సదరం స్లాట్ బుక్ చేసుకుని, నిర్దేశించిన ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మెడికల్ బోర్డ్ పరీక్ష ఫలితాల ఆధారంగా సర్టిఫికేట్ మంజూరు చేయబడుతుంది.
సదరం సర్టిఫికేటుకు స్వంతంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనే అవకాశము లేదు. కేవలం గ్రామ/వార్డు సచివాలయాలు మరియు మీ-సేవాల ద్వారానే దరఖాస్తు చేసుకొనడానికి అవకాశం ఉంటుంది.
సదరం సర్టిఫికేట్ యొక్క ప్రయోజనాలు:
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు - దివ్యాంగులకు సంబంధించిన అన్ని పథకాలలో అర్హత పొందడానికి అవసరమైన అధికారిక సర్టిఫికేట్.
- వికలాంగ పెన్షన్ - దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అందించే వికలాంగ పెన్షన్ (Disability Pension) పొందేందుకు అర్హత.
- ఉచిత మరియు తక్కువ చార్జీ ప్రయాణ సదుపాయం - APSRTC బస్సుల్లో ఉచిత లేదా రాయితీ ధరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
- ఉచిత వైద్యం & ఆరోగ్య బీమా - ఆరోగ్య భీమ & ఇతర ప్రభుత్వ వైద్య సేవలు పొందేందుకు వీలైన అధికారిక ధృవీకరణ పత్రం.
- విశేష విద్యా & ఉపాధి అవకాశాలు - దివ్యాంగుల కోసం ప్రత్యేక విద్యా, స్కాలర్షిప్లు, మరియు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలైన అధికారిక ధృవీకరణ పత్రం.
- ప్రత్యేక గుర్తింపు & రాయితీలు - ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో వికలాంగ రిజర్వేషన్లు, మరియు ప్రత్యేక రాయితీలు పొందే అవకాశం.
- స్వయం ఉపాధి & స్టార్ట్-అప్ రుణాలు - దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అందించే బ్యాంకు రుణాలు, మద్దతు పథకాలు.
- మొబిలిటీ & సహాయ పరికరాలు - దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్స్, హియరింగ్ ఎయిడ్స్, ప్రోస్థటిక్ లిమ్స్ వంటి సహాయ పరికరాలు ఉచితంగా లేదా తక్కువ ధరకే పొందే అవకాశం.
- 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత (Physical Disability) ఉన్నవారు.
- శారీరక(Locomotor/OH).
- దృష్టి లోపం (Visual Impairment).
- వినికిడి లోపం (Hearing Impairment).
- మానసిక మాంద్యం (Mental Retardation).
- మానసిక అనారోగ్యం (Mental Illness).
- దరఖాస్తు దారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసిస్తున్న వ్యక్తి కావాలి.
- పిల్లలు & పెద్దలకు సమాన అర్హతలు.
- అప్లికేషన్ ఫారం.
- ఆధార్ కార్డు జిరాక్స్.
- ఆధార్ కు లింక్ అయినా మొబైల్ కు వచ్చే ఓటిపి.
- చిరునామా ప్రూఫ్ [రేషన్ కార్డు / ఆధార్ కార్డు / బ్యాంకు బుక్కు వంటివి].
- ఒకటి ఏ రోజు, ఎన్ని గంటలకు వెళ్లాలో వివరాలతో రసీదు జనరేట్ అవుతుంది.
- రెండు WL-వెయిటింగ్ లిస్ట్ అని రసీదు జనరేట్ అవుతుంది.
(WL అని ఉన్న వారు ప్రభుత్వం తదుపరి సదరం సర్టిఫికేట్ స్లాట్స్ విడుదల చేసే వరకు వేచి ఉండాలి. వెయిటింగ్ లిస్టు క్లియర్ అయిన తరువాత స్లాట్ బుక్ చేసుకున్న వారికి వారు సదరం స్లాట్ బుక్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS రూపంలో ఏ రోజు, ఎన్నిగంటలకు ఆసుపత్రికి వెళ్లాలో మెసేజ్ వస్తుంది. ఆలా మెసేజ్ రాని వారు, కింద ఇవ్నవబడిన లింకులో ఎప్పటికి అప్పుడు మీ సదరం స్లాట్ బుకింగ్ స్థితిని మీ మొబైల్ లోనే తనిఖీ చేసుకోవచ్చు). - AP సదరం స్లాట్ బుకింగ్ స్థితిని తనిఖీ చేయుట కొరకు Check Sadarem Status క్లిక్ చేయండి.
- ఇ - మెయిల్ ID: sadarem.helpdesk@aptonline.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి