నిర్వచనం:
వివిధ కారణాలచే సామాజిక ప్రక్రియలకు సాధారణ స్థాయిలో స్పందించలేని పరిస్థితినే వైకల్యం అంటారు. వైకల్యం అనేది సంక్లిష్టతతో కూడిన వాస్తవ స్థితి. అది సాధారణంగా భౌతికంగా ఉంటుంది మరియు పరిజ్ఞానం, ప్రవర్తన తదితరాలకు సంబంధించి కూడా కనిపిస్తుంది. దీనినే నిస్సహాయత లేదా ఆశక్తత అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వైకల్యం సమాజంలో ప్రధానంగా రెండు రాకాలుగా కనబడుతుంది.
1. శారీరక వైకల్యం: ఇది ప్రధానంగా పుట్టుకతో సంక్రమించవచ్చు, పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల వలన కలుగవచ్చు లేదా ప్రమాదవశాత్తు కలిగే అంగవైకల్యం వలన ఏర్పడే స్థితి. ఇది ఉన్నవారిని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని పిలుస్తారు.
2. మానసిక వైకల్యం: ఇది మానసిక బలహీనతల వలన కలిగే వైకల్యం. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారిని మెంటల్లీ ఛాలెంజ్డ్ అని పిలుస్తారు.
దివ్యాంగుల హక్కు చట్టం - 1995 ప్రకారం ఏడు రకాల వైకల్యాలు కలవు. తదుపరి దివ్యాంగుల హక్కు చట్టం - 2016 తో కొత్తగా మరో 14 లోపాలను చేర్చారు. మొత్తంగా 21 రకాల వైకల్యాలు కలవు. ఈ చట్టం 19 ఏప్రిల్ 2017 నుండి అమలులోకి వచ్చింది.
- చలనశీల వైకల్యం/కదలిక లోపం.
- మానసిక బలహీనత
- అందత్వం
- తక్కువ కంటి చూపు
- వినికిడి లోపం
- మానసిక వైకల్యం
- కుష్టు వ్యాధిగ్రస్తులు
- మరుగుజ్జుతనం
- పార్కిన్ సన్స్
- యాసిడ్ దాడి బాధితులు
- ఇంటలెక్చువల్ డిజెబిలిటి
- ఆటిజం
- మస్కులార్ డిస్త్రోఫి
- దీర్ఘకాల (క్రానిక్) నాడీ సంబంధ వ్యాధులు
- ప్రత్యేక అభ్యసన వైకల్యం
- మల్టిపుల్ స్లీరోసిన్
- మాట, భాషా వైకల్యం
- తలసీమియా
- హీమోఫీలియా
- సికిల్సెల్ ఎనీమియా
- బహుళ వైకల్యాలు (పైన పేర్కొన్న వాటిలో ఒకటి కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు).
ముఖ్యమైన దినోత్సవాలు:
- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం - డిసెంబర్ 3 (1998 నుండి జరుపబడుతుంది).
- ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం - ఏప్రిల్ 2.
- ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం - జనవరి 4 (బ్రెయిలీ ఆవిష్కర్త అయిన లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా జరుపుతారు).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి