వికలాంగుల హక్కు చట్టం - 2016 ప్రకారం మొత్తం 21 రకాల వైకల్యాలు కలవు. వాటి గురించి అవగాహన కొరకు క్లుప్తంగా ఇచ్చట ఇవ్వబడెను.
1. Leprosy Cured Person: కుష్టు వ్యాధి పూర్తిగా నయమైన వాళ్లు. చేతులు లేదా కాళ్లు దెబ్బతిని ఉన్నవారు.
2. Locomotor Disability: కాళ్లు లేదా చేతులు సరిగా కదలకపోవడం, నడవడంలో సమస్య. పోలియో, అక్సిడెంట్ వల్ల చేతులు కాళ్లు విరిగినవారు.
3. Dwarfism: ఎత్తు చాలా తక్కువగా ఉండటం (మరుగుజ్జు). ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. నాలుగు అడుగులు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్నవారు.
4. Cerebral Palsy: పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా ఉండకపోవడం. చేతులు, కాళ్లు వణకడం లేదా బలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు.
5. Muscular Dystrophy: కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే వ్యాధి. నడవడం, చేతులు ఎత్తడం ఇబ్బందిగా ఉన్నవారు.
6. Chronic Neurological Conditions: చాలా కాలం నుంచి నాడీ సమస్యలు (మెదడు లేదా నరాలు దెబ్బతినడం). నడవలేకపోవడం, చేతులు కాళ్లు కదల్చలేనివారు.
7. Multiple Sclerosis: నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయే వ్యాధి. చూడడం, నడవడం, మాట్లాడడం సమస్యలు ఉన్నవారు.
8. Parkinson’s Disease: వణకు వచ్చి, చేతులు కాళ్లు కదలడం కష్టం అయ్యే వ్యాధి. చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడేవారు.
9. Hearing Impairment: చెవులతో సరిగా వినలేకపోవడం. కొంచెం వినడం లేదా పూర్తిగా వినకపోవడం (చెవుడు ఉన్నవారు).
10. Mental Illness: మనసు సమస్యలు (డిప్రెషన్, భయం, మనసు గందరగోళం). రోజువారీ జీవితం సరిగా నడవకపోవడం లేదా ఇబ్బందులు ఉన్నవారు.
11. Intellectual Disability: (మంద బుద్ది / బుద్ది మాంధ్యం) తెలివి సాధారణం కంటే తక్కువగా ఉండటం. చదువు, మాట్లాడటం, రోజువారీ పనులు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు.
12. Blindness: కంటి చూపు పూర్తిగా లేని వారు.
13. Low-Vision: కళ్లతో కొంచెం మాత్రమే చూడగలగడం. దూరం లేదా దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు.
14. Hemophilia: రక్తం సరిగా గడ్డ కట్టని వ్యాధి ఉన్నవారు (చిన్న గాయం అయినా ఎక్కువ రక్తం పోవడం).
15. Thalassemia: శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి ఉన్నవారు (ఎప్పుడూ రక్తం ఇవ్వాల్సి ఉంటుంది).
16. Sickle Cell Disease: రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువ అయ్యే వ్యాధి. చాలా నొప్పి మరియు అలసట వస్తుంది – ఇటువంటి లక్షణాలు ఉన్నవారు.
17. Acid Attack Victims: ఆసిడ్ దాడి వల్ల ముఖం, శరీరం దెబ్బతినడం. ఆసిడ్ దాడి వల్ల చర్మం, కళ్లు, చేతులు సమస్యలు వచ్చినవారు.
18. Speech & Language Disability: మాట్లాడటం లేదా భాష అర్థం కాకపోవడం. మాటలు స్పష్టంగా రాకపోవడం వంటి సమస్య ఉన్నవారు.
19. Specific Learning Disability: చదవడం రాకపోవడం, రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోవడంలో మాత్రమే ప్రత్యేక సమస్య. తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదువు కష్టంగా ఉంటుంది – ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు.
20. Autism Spectrum Disorder: ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య. ఒంటరిగా ఉండాలని అనిపించడం, కొన్ని పనులు రిపీట్ చేయడం వంటి సమస్యలు ఉన్నవారు.
21. Multiple Disabilities: ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు (ఉదా: కళ్లు + చెవులు లేదా కదలిక + మనసు).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి